ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వసం.. భారీగా ఆయుధాలు స్వాధీనం

-

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్ట్ లపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత వారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించి.. ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయనే సమాచారం మేరకు ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని సెడోరీ నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి.

ఈ ప్రాంతంలో ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే లక్ష్యంతో ముస్కరులు కుట్ర పన్నుతున్నారని సమాచారం. ఈ సమయంలో సైన్యం వారి స్థావరాలను ధ్వంసం చేయడం ఉగ్రవేటలో మరో ముందడుగు అని.. పహల్గామ్ ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. నాటి నుంచి భద్రతా దళాలు వారి ఆచూకి కోసం రాష్ట్రం అంతటా జల్లెడ పడుతున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పని చేస్తు్న ఇద్దరినీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news