నేడు ఢిల్లీలో 46వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం

-

నేడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న 46వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ తెలిపింది. ఈ స‌మావేశం ఉద‌యం 11 గంట‌ల‌కు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశానికి కేంద్ర‌ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తో పాటు డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్ పాల్టొంటారు. వీరితో పాటు దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాల తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు హాజరవుతారు.

కాగ ఈ సారి జ‌ర‌గ‌నున్న జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో ముఖ్యంగా ధ‌ర‌ల రేష‌న‌లైజేష‌న్ పై చ‌ర్చ జ‌రుపుతారు. ధ‌రల‌ రేష‌న‌లైజేష‌న్ గురించి గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్ కౌన్సిల్ కు ఒక నివేదిక స‌మ‌ర్పిస్తుంది. జీఎస్టీ లో 5, 12, 18, 28 శాతంతో శ్లాబ్ లో ఉన్నాయి. అలాగే గురువారం రోజు ప్రీ బ‌డ్జెట్ స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మావేశానికి కొన‌సాగింపుగా జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశాల్లో కొన్ని వ‌స్తువల పై ప‌న్ను స‌వ‌ర‌ణ గురించి చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే వ‌స్త్రాల‌తో పాటు చెప్పులు వంటి వాటిపై జీఎస్టీ ని పెంచే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news