ఆ పురుగు మందుల వాడకంపై నిషేధం విధించిన కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 4 పురుగుమందుల వాడకంపై నిషేధం విధించింది. డైకోఫాల్, డైనోక్యాప్, మేతోమిల్, మోనోక్రోటోఫాస్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లిస్టులో తొలి 3 మందులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, విక్రయాలు, పంపిణీ పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

The Center has banned the use of pesticides

మొనోకోటోఫాస్ మందు తయారీకి ఇకనుంచి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయబోమని తెలిపింది.

ఈ పురుగుమందులు ఆ పంటలకు వాడొద్దు: కేంద్రం

* మలాథియాన్: జొన్నలు, శనగ, సోయాబీన్, ఆముదం, పొద్దుతిరుగుడు, బెండ, వంకాయ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, యాపిల్, మామిడి, ద్రాక్ష, టమాటా. * క్వినాల్ ఫాస్ : జూట్, యాలకులు, జొన్న * మ్యాన్ కోజేబ్ : జొన్న, జామ, టాపియోకా * ఆక్సీ ఫ్లోర్ ఫెన్ : ఆలూ, వేరుశెనగ * డైమిథోయేట్ : పండ్లు, కూరగాయలు * క్లోరోపైరీఫాస్ : రేగు, నిమ్మ, పొగాకు, బత్తాయి

 

Read more RELATED
Recommended to you

Exit mobile version