అక్టోబర్ 20 లోపు నూతన టెలికాం బిల్లు ప్రజాభిప్రాయం కోరిన కేంద్రం

-

మరో ఆరు నుంచి పది నెలల్లో పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం కోసం డ్రాఫ్ట్ బిల్లు విడుదల చేసారు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. నూతన టెలికాం బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం తొందరపడడం లేదన్నారు కేంద్రమంత్రి. ప్రజాభిప్రాయం,సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాక తుది డ్రాఫ్ట్న రూపొందిస్తామని తెలిపారు అశ్వినీ వైష్ణవ్.

తుది డ్రాఫ్ట్ ను తొలుత పార్లమెంట్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెడతామన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885,ఇండియన్ వైర్ లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధ స్వాధీనం) యాక్ట్ 1950 స్థానంలో కేంద్రం నూతన బిల్లు తీసుకు వస్తుందన్నారు. అక్టోబరు 20లోపు నూతన టెలికాం బిల్లు ప్రజాభిప్రాయం కోరింది కేంద్రం.

ఇంటర్నెట్ ద్వారా ఆడియో, వీడియో కాలింగ్, మెసేజింగ్ సేవలు అందిస్తున్న వాట్సప్, జూమ్, గూగుల్ డుయో, ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు సైతం ఇకపై దేశీయంగా టెలికాం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులో పొందుపరిచింది కేంద్రం. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుముల్ని మాఫీ చేసే నిబంధనను సైతం బిల్లులో ప్రతిపాదించింది ప్రభుత్వం. టెలికామ్ సంస్థలు లైసెన్సులను సరెండర్ చేసిన సందర్భంలో రుసుములు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రతిపాదనను నూతన బిల్లులో చేర్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version