ఉచితంగా రూ.2 లక్షలు పొందే అవకాశన్ని కల్పిస్తున్న కేంద్రం..!

-

అదిరిపోయే ఒక ఆఫర్ ని మోదీ ప్రభుత్వం కల్పిస్తోంది. దీని ద్వారా రూ.2 లక్షలు పొందుచు. అది కూడా ఫ్రీ గానే. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీని కోసం మీరు ఒక పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. గెలిచిన వాళ్లకి బహుమతి పొందే అవకాశం వుంది.

పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కేంద్రం అనుకుంటోంది. దీని కోసం స్పెషల్ కాంటెస్ట్‌ నిర్వహిస్తోంది. ఇందులొ పాల్గొని గెలిస్తే.. రూ.2 లక్షలు పొందొచ్చు.

ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన తీసుకు రావడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాల్సి ఉంటుంది. ఇది 30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉంటే సరిపోతుంది.

18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. జూన్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి – https://www.mygov.in/task/short-film-making-contest

ఇక బహుమతులు విషయంలోకి వస్తే.. ఫస్ట్ ప్రైజ్ కింద రూ.2 లక్షలు, సెకండ్ ప్రైజ్ కింద రూ.1.5 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.లక్ష అందిస్తారు. అలాగే మరో పది మందికి రూ.10 వేల చొప్పున అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news