ఎస్కలేటర్ ఎక్కుతుండగా.. తండ్రి చేతుల్లోంచి జారిపడి చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పుర్ మాల్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్ మాల్లో ఓ తండ్రి ఏడాదిన్నర బాలుడిని ఎత్తుకుని ఉండగా, ఎస్కలేటర్ ఎక్కుతున్న మరో బాలుడిని అతను ఆపేందుకు ప్రయత్నించాడు. ఇంతలో చేతిలో ఉన్న చిన్నారి జారి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పుడు ఈ సంఘటన అందరిని కలిచివేస్తోంది.