ఈ వ్యాక్సిన్ల ప్రభావం డెల్టా వేరియంట్‌పై తక్కువేనట..!

-

కొవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించారు. టీకా తీసుకోవడం ద్వారా వైరస్ ఇక ఏం చేయబోదని అనుకున్నారు. కానీ, వైరస్ మాత్రం రకరకాలుగా రూపాంతరం చెందుతూ వస్తోంది. భయంకరమైన డెల్టా వేరియంట్ ప్రస్తుతం జనాలను తెగభయపెడుతోంది. ఈ క్రమంలోనే కొవిడ్ వేరియంట్‌పై ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ప్రభావశీలతపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. డెల్టా వేరియంట్‌పై ఈ వ్యాక్సిన్స్ ఫైజర్, ఆస్ట్రాజెనెకా తక్కువగానే పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్
Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందేందుకుగాను ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే కొంత కాలం వరకు బానే ఉంటుందని తెలిపారు. అయితే, ఫైజర్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ కాలం రక్షణ ఆస్ట్రెజెనెకా వ్యాక్సిన్‌తో లభిస్తుందని పరిశోధకులు తేల్చారు. మొత్తంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్స్ తీసుకున్న నాలుగు నుంచి ఐదు నెలల వరకు మాత్రమే డెల్టా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తుందని ఆక్స్‌ఫర్డ్ నిపుణులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్స్ వల్ల హ్యూమన్స్‌పై కొవిడ్ ప్రభావం ఎలా ఉండబోతున్నదనే విషయమై దీర్ఘకాల అధ్యయనాలు జరపబోతున్నారు నిపుణులు.

ఈ క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రెండు డోసుల టీకా తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలి, భౌతిక దూరం కంపల్సరీగా పాటించాలి. అయితే, కరోనా మహమ్మారి ఇక తగ్గుముఖం పట్టిందని కొంత మంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి ద్వారా ఇతరులకు ప్రమాదం పొంచి ఉన్నది. ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా త్వరలో థర్డ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవడంతో పాటు యాంటీ బాడీస్ పెరుగుదల ఉంటుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news