ఓమిక్రాన్ వేరియంట్ దూసుకురావడం తో వచ్చే ఏడాది జనవరి లేదా.. ఫిబ్రవరి లో థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తలు ఎక్కువ అవుతున్నాయి. తాజా గా ఐఐటీ కాన్పూర్ ప్రొపెసర్ కూడా దీని పై అలర్ట్ చేశారు. అయితే నిజంగా నే థర్డ్ వేవ్ వస్తే మళ్లి అనేక రంగాల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఈ నేపథ్యం లో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకబోతున్నట్టు తెలుస్తుంది. నేటి ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఆధ్వర్యం లో మానటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) సమావేశం కానుంది. ఈ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది.
అయితే ఈ సమావేశం లో ఆర్బీఐ వడ్డి రేట్ల పై కీలక నిర్ణయం తీసుకబోతుందని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ భావిస్తుంది. ఈ సమావేశాలలో రెపో రెట్ల ను, రివర్స్ రెపో రెట్ల ను నామ మాత్రం గా అయిన సవరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కాగ చివరి సారి 2020 మే లో కరోనా వ్యాప్తి ఎక్కువ గా ఉన్న రోజులలో ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించింది. అయితే థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్న సందర్భం లో ఇప్పుడు కూడా వడ్డీ రేట్లను సవరించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.