భార్య ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా విడాకుల తర్వాత భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తాజాగా తీర్పు ఇచ్చింది. భార్య నెలకు రూ. 15000 భరణం చెల్లించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఒక వ్యక్తి సవాల్ చేశారు. మాజీ భార్య ఫిజియోథెరపిస్ట్ అని పిల్లలను చూసుకోగలిగేంత డబ్బులను సంపాదిస్తుందని తనకు జీవన భృతి అవసరం లేదని ఓ వ్యక్తి కోర్టుకు వెల్లడించాడు. అతని వాదనలతో పాటు పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది.

తప్పకుండా విడాకుల తర్వాత భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని వెల్లడించింది. దీంతో విడాకుల తర్వాత భార్యకు తప్పకుండా భరణి ఇవ్వాలని స్పష్టం చేసింది కోర్టు. ఇదిలా ఉండగా…. నేటి కాలంలో విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలు ఉన్నప్పటికీ వారి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోతున్నారు. దీంతో చిన్నపిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది.