బెలూన్ ఊదుతూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారి, అసలేం జరిగిందంటే…!

-

మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. బెలూన్ ఊదుతూ… ఒక చిన్నారి బెలూన్ మింగేసాడు. ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. అంధేరీలో తన అక్కతో ఆడుకుంటున్న చిన్నారి బెలూన్ లోపలి వెళ్ళడంతో ప్రాణాలు కోల్పోయాడని అతని మేనమామ వెల్లడించాడు. పడుకుని ఊదుతున్నాడు అని, ఆ తర్వాత అది జారిపోయి మింగేసాడు అని తల్లి తండ్రులు వెల్లడించారు.

బాలుడి గొంతు నుండి బెలూన్‌ ను తీయడానికి వారు ప్రయత్నించారని, కానీ అది లోపలికి లోతుగా వెళ్ళడంతో తీయలేకపోయామని కుటుంబం వెల్లడించింది. కుటుంబం వెంటనే వెంటనే నానావతి ఆస్పత్రికి తరలించినా సరే ఉపయోగం లేకపోయింది. ప్రమాదవ శాత్తు జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదు చేసారు. అంధేరిలోని గుండవ్లిలో నివసిస్తున్న బాలుడి తండ్రి ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాన్ షాప్ నడుపుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version