రతన్ టాటా అంటే గుర్తుకొచ్చేది టాటా సంస్థలు, ఆయన వ్యాపార సామ్రాజ్యం. నమ్మకం, విశ్వసనీయతకు మారు పేరు. కేవలం ఒక్కరోజులో ఆయన విజయాన్ని సాధించలేదు. రతన్ టాటా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదగడానికి ఎన్నో కారణాలున్నాయి. శ్రమ, ఆలోచనలే టాటాను ఇంతటివారిని చేశాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వలేకపోవడం, విజయం సాధించామని పొంగిపోవడం ఆయనకు తెలియదు. ప్రపంచంలో చాలా మంది వ్యాపారవేత్తలున్నారు. కానీ వారిలో కొందరినీ మాత్రమే సమాజం గుర్తించుకుంటుంది.
వ్యాపారం చేసి సంపాదించడమే కాదు.. సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా.ఇంతటి పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఎప్పుడూ ఆశించలేదు. సరికొత్త ఆలోచనలతో.. కొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్లారు. వాస్తవానికి టాటా సంస్థలు విస్తరించని రంగం అంటూ లేనే లేదని చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్ వస్తువులు ప్రారంభించి.. నిత్యావసర వస్తువుల వరకు ప్రతీ విభాగానికి టాటా సంస్థ విస్తరించింది. ఇలా టాటా సంస్థను అభివృద్ధి చేయడంలో టాటా సంస్థ కృషి చాలానే ఉందని చెప్పాలి.