ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ – చిదంబరం

-

నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి బడ్జెట్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ తో ప్రజలు నిరాశ చెందారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అని మండిపడ్డారు.

బీహార్ ఎన్నికలను ఉద్దేశించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని.. కీలక రంగాలకు కేటాయింపులు తక్కువ చేశారని విమర్శించారు. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయని.. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించిందని ఆరోపించారు. గత బడ్జెట్ లో చెప్పిన అనేక కార్యక్రమాలు ఇంకా కార్యాచరణకు నోచుకోలేదన్నారు. బడ్జెట్ లో చెప్పేవి ఆచరణలో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చిదంబరం.

ఇక ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఖజానాలో ఎక్కువ భాగం కొంతమంది ధనవంతులైన బిలినియర్ల రుణాలను మాఫీ చేయడానికి ఖర్చు చేస్తుందని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్లు ను సగానికి తగ్గించాలని అన్నారు. ఇది జరగనందుకు చాలా బాధగా ఉందని అన్నారు కేజ్రీవాల్.

Read more RELATED
Recommended to you

Latest news