కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా మారింది – ప్రశాంత్ రెడ్డి

-

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మండిపడ్డారు బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నేడు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవోదయ స్కూల్ల ప్రకటన, తెలంగాణకు ఉపయోగపడే మరే అంశం గాని బడ్జెట్ లో లేదన్నారు. బిజెపి నుంచి ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నా సాధించింది మాత్రం సున్నా అని మండిపడ్డారు.

ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటే.. తెలంగాణకు న్యాయం జరిగేదన్నారు. రాష్ట్రంలో ట్విట్టర్ కి, టిక్ టాక్ కి కూడా తేడా తెలియనివాడు పాలన చేయమంటే ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసి తెలంగాణ ప్రజల చేత తన్నించుకున్నాడని, మీరు పెట్టిన సర్వేలో కేసీఆర్ కి 70% ఓట్లు పడేసరికి రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు.

రేవంత్ రెడ్డిది సంస్కారహీనమైన భాష అని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. మాట ఇస్తే తప్పని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. రుణమాఫీ పై రకరకాల డెడ్లైన్లు పెట్టి మాట తప్పింది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరిపై ఒట్టు వేసి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నది ఎవరు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news