ICC World Cup 2023 : ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ 16 మందితో అంపైర్ల జాబితాను ప్రకటించింది. భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిధ్యం లభించింది. నలుగురు రిఫరీల లిస్టును విడుదల చేయగా… భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ కి అవకాశం దక్కింది. అక్టోబర్ 14న జరిగే భారత్-పాక్ మ్యాచ్ కు ఇల్లింగ్ వర్త్, ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా…. కెటిల్ బోరో థర్డ్ అంపైర్ గా, అండి పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు.
కాగా, ఈ వరల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టుకు 4 మిలియన్ ల అమెరికా డాలర్లు అనగా భారతీయ కరెన్సీ లో 33 కోట్ల 17 లక్షలు బహుమతిగా యివ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక రన్నర్ అప్ గా నిలిచినా జట్టుకు అందులో సగం అంటే 2 మిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీ లో 16 కోట్ల 58 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. మరి ఎవరు విజేతగా నిలిచి ఈ బహుమతిని సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.