BREAKING : ‘ప్రధాని మోదీని చంపేస్తా’.. NIA కంట్రోల్ రూమ్ కు బెదిరింపు కాల్

-

భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి మోదీని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తమిళనాడు చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు.. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇలా మోదీకి హత్య బెదిరింపులు రావడం ఇది మొదటి సారేం కాదు. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీలైనంత త్వరగా ఈ కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news