వన్యప్రాణులకు సంబంధించిన అద్భుతమైన వీడియోలు ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ వీడియోనే ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నిద్రపోతున్న ఓ గున్న ఏనుగును క్రూరమృగాల బారి నుంచి కాపాడుకునేందుకు మిగతా ఏనుగులు రక్షణగా నిలిచాయి. గున్న ఏనుగు చుట్టూ మిగతా పెద్ద ఏనుగులన్నీ రక్షణ వలయంగా ఏర్పడి జెడ్ కేటగిరీ భద్రతతో కునుకు తీస్తున్న దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
‘‘తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అందమైన ఏనుగు కుటుంబం ఎంతో హాయిగా నిద్రిస్తోంది. చూడండి గున్న ఏనుగుకు ఆ కుటుంబం ఏవిధంగా జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది..! అలాగే ఓ పెద్ద ఏనుగు కుటుంబ సభ్యుల భద్రతను గమనిస్తూ ఎలా లేచి చుట్టుపక్కల పరిస్థితిని గమనిస్తుందో.. అచ్చం మన కుటుంబంలానే ఉంది కదూ’’ అంటూ ఆమె క్యాప్షన్ జోడించారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
A beautiful elephant family sleeps blissfully somwhere in deep jungles of the Anamalai Tiger Reserve in Tamil Nadu. Observe how the baby elephant is given Z class security by the family. Also how the young elephant is checking the presence of other family members for reassurance.… pic.twitter.com/sVsc8k5I3r
— Supriya Sahu IAS (@supriyasahuias) May 16, 2024