నేడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో, హెచ్‌సీఎ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 173 మంది ఓటు వేయనుండగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు. ఫలితాలు ఇవాళ సాయంత్రం 4 తర్వాత వెలువడనున్నాయి.
ఇది ఇలా ఉండగా హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే వ్యవహారంపై హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌పై రెండు చొప్పున కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకతవకలతో సంబంధం ఉన్న ఫైర్ విన్ సేఫ్టీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సారా స్పోర్ట్స్, బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సలెంట్ ఎంటర్‌ప్రైజెస్ తదితర నాలుగు సంస్థల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.