నేడు ప్ర‌ధాని మోడీ మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం

-

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌న్ కీ బాత్ ఈ రోజు నిర్వ‌హించ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ త‌న మ‌న‌స్సులోని మాట‌ల‌ను దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్నారు. ఆల్ ఇండియా రేడియో, డీడీ నేష‌న‌ల్ తో పాటు డీడీ న్యూస్ లో ప్ర‌సారం అవుతుంది. నేడు జ‌ర‌గ‌బోయే 84వ ఎపిసోడ్ లో ముఖ్యంగా క‌రోనా వైర‌స్ గురించి మ‌ట్లాడే అవ‌కాశం ఉంది. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఓమిక్రాన్ పై కూడా మాట్లాడే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగ శ‌నివారం రాత్రి జాతిని ఉద్ధేశించి ప్ర‌ధాని మాట్లాడిన సంద‌ర్భంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మ‌ద్య పిల్ల‌ల‌కు టీకా వేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాగే ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కు బూస్ట‌ర్ డోస్ ఇవ్వనున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే నేడు మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో మ‌రిన్నీ విష‌యాలు మాట్లాడే అవకాశం ఉంది. కాగ మన్ కీ బాత్ కార్య‌క్ర‌మం 2014 అక్టోబ‌ర్ 3 నుంచి ప్రారంభం అయింది. ప్ర‌తి నెల చివ‌రి వారంలో ప్ర‌ధాని మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు 83 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. నేడు 84వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతుంది. చివ‌రి ఎపిసోడ్ న‌వంబ‌ర్ నెల‌లో 28 న ప్ర‌సారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news