తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే 65 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ !

-

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు… ఉద్యోగ నోటిఫికేషన్ పడుతుందోనని… కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్.. వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది. సీఎం కేసీఆర్ త్వరలో ఉద్యోగాల ప్రకటన అని ప్రకటించి కూడా దాదాపు ఏడాది గడుస్తోంది.

kcr
kcr

ఇలాంటి తరుణంలో కొత్త ఏడాదిలో కేసీఆర్ సర్కార్ కొలువుల జాతర ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ… 2022 జనవరి 20వ తేదీ వరకు పూర్తవుతుంది. ఆ సమయానికి పోస్టుల ఖాళీలపై ప్రభుత్వానికి స్పష్టత కూడా రానుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం 65 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసేందుకు… నోటిఫికేషన్ను కూడా వస్తాయని.. కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

NOTE : ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news