హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

-

హైదరాబాద్-హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఓయూ పీఎస్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్-హబ్సిగూడలో బలవన్మరణానికి భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Four suicides in the same family

చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని ఓయూ సీఐ రాజేందర్ పేర్కొన్నారు. హబ్సిగూడలోని రవీంద్రనగర్ కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని రాత్రి 9:30కు సమాచారం వచ్చిందన్నారు ఓయూ సీఐ రాజేందర్. భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకున్నారు… గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పని చేసి ఉద్యోగం మానేసిన చంద్రశేఖర్ రెడ్డి… అంతకుముందే వాళ్ల కుమార్తె, కుమారుడికి ఉరి వేసినట్లు ప్రాథమికంగా తేలిందని చెప్పారు. ఆర్థిక కష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారన్నారు ఓయూ సీఐ రాజేందర్.

https://twitter.com/bigtvtelugu/status/1899267196930699431

Read more RELATED
Recommended to you

Latest news