ప్రపంచాన్ని అల్లాడిస్తోన్న కరోనా చేతిలో భారత్ కూడా ఈ స్థాయిలో విలవిల్లాడటానికి కారణం ఏమిటి అంటే… ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ వ్యవహారం అని చెప్పేస్తుంటారు అందరూ! మొదట్లో ఈ వ్యవహారం రేపిన చిచ్చు మామూలుది కాదు… కాకపోతే తదనంతర కాలంలో కరోనా వ్యాప్తికి ఒక కులాన్ని, మతాన్ని ఆపాదించకూడదని సంయమనం పాటించారు అంతా! ఈ పరిస్థితితుల్లో తాజాగా ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దలకు సంబందించిన ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే… వారి బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయల నిధులు వచ్చి చేరాయని!
అవును… దేశ రాజధాని ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ పెద్దల బ్యాంక్ ఖాతాలకు కోట్ల రూపాయల నిధులు వచ్చాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలిందట. గల్ఫ్ కంట్రీల నుంచి నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల బ్యాంక్ ఖాతాలలో పెద్దఎత్తున నగదు జమైందని పోలీసుల విచారణలో తేలిందట. దీంతో బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అయిన కోట్లాది రూపాయల నగదు వివరాలను ఇప్ప్టికే ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఈడీ అధికారులకు అందజేశారట! ఇలా పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచి నగదు జమైన ఖాతాల్లో మౌలానా సాద్ తో పాటు అతని కుమారులు, అతని సోదరుడి ఖాతాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారట.
ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు మౌలానా సాద్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మౌలానా సాద్ ఫాం హౌస్ 2 కోట్ల రూపాయల అంతర్జాతీయ నిధులతో కొన్నట్టు తేలిందట. ఇదే క్రమంలో మర్కజ్ కు కూడా నిధులు ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట ఈడీ అధికారులు. నిధులు హవాలా మార్గంలో వచ్చాయా? లేక.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారట. దీంతో… ఈ వ్యవహారం అంత ఆషామాషీగా తేలేది కాదని… తీగలాగితే డొంకంతా కదిలేలాఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి!