తండ్రికి క్యాన్సర్… కాని కొడుకు పెళ్లి చూడటం అతని జీవితంలో అతి పెద్ద కోరిక. అతని జీవితానికి అతి పెద్ద కోరిక కూడా అదే. ప్రాణాల మీదకు వస్తుంది. ఇప్పుడు లాక్ డౌన్ అమలులో ఉంది. ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. కాని కొడుకు పెళ్లి చూడాలి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక సంఘటన జరిగింది. సంతోష్ చౌహాన్ అనే వ్యక్తి తండ్రికి క్యాన్సర్. ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పలేని పరిస్థితి.
దీనితో పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. కోర్ట్ లో తాను పెళ్లి చేసుకోవాలని తన తండ్రికి తన పెళ్లి చూడటం చివరి కోరిక అని చెప్పుకున్నాడు. దీనితో కోర్ట్ కూడా సానుకూలంగా స్పందించి… అక్కడ కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి 5 మందికి మించి ఉండకూడదు అని చెప్పడంతో జాగ్రత్తగా వివాహం చేసారు. వరుడి సోదరుడు ఈ విషయమై మాట్లాడుతూ ‘‘మా నాన్న క్యాన్సర్ పేషెంట్ అని… అతని చిన్న కొడుకు పెళ్లి చూడటం ఆయన చివరి కోరిక అని చెప్పాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్‌డౌన్ కొనసాగుతున్నందున.. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నామని చెప్పాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఇద్దరికీ కొద్ది రోజల క్రితమే నిశ్చితార్థం జరిగిందని కాని లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది అని చెప్పాడు. తండ్రి ఎప్పుడు చనిపొతారో తెలియదు కాబట్టి పెళ్లి చేసుకున్నా అని సంతోష్ చెప్పాడు.