పొలంలో పడ్డ ఆయిల్ ట్యాంకులు.. హడలిపోయిన రైతులు

-

ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని సంత్ కబీర్​నగర్​ జిల్లాలో ఓ విమానం నుంచి వరి పొలంలోకి రెండు ఇంధన ట్యాంకులు పడిపోయాయి. ఆ సమయంలో పొలంలో పని చేస్తున్న రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూకంపం వచ్చిందేమోనని భయకంపితులయ్యారు. పొలంలో భారీ ట్యాంకులు పడటం చూసి షాకయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఎస్పీ సత్యజిత్ గుప్తా.. ట్యాంకులను గుర్తించి ఈ విషయాన్ని భారత వైమానిక దళానికి తెలియజేశారు.

భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల బాహ్య ఇంధన ట్యాంకును పైలట్‌.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ ఇంధన ట్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌నగర్‌ జిల్లాలో ఉన్న బంజారియా బలుశాషన్‌ అనే గ్రామంలో పడిందని.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆస్తి నష్టం కూడా జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సాధారణ శిక్షణలో భాగంగా ఈ విమానం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ నుంచి నింగిలోకి పయనమైంది. అది వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news