యూజీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్ డీ సీట్ల కేటాయింపు

-

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ సీట్లు కేటాయింనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం యూనివర్శిటీలు వేర్వేరుగా పరీక్షలను నిర్వహిస్తుంటాయి. అయితే విద్యార్థులు ఒక సీట్ కోసం అనేక పరీక్షాలు రాయాల్సి వస్తోందని భావించిన యూజీసీ… ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ సూచన మేరకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ సీట్లను నెట్ మార్కుల ఆధారంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. నెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను మూడు కేటరిగీలుగా విభజించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మొదటి కేటగిరిలో పీహెచ్‌డీతోపాటు.. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రెండో కేటరిగిలో పీహెచ్‌డీతోపాటు…  కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమిస్తారు. మూడో కేటగిరి వారికి కేవలం పీహెచ్ డీ సీటును మాత్రమే కేటాయించనుంది. నెట్ స్కోర్ తో పాటు ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్ డీ సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. 2,3 కేటిగిరీల్లో స్కోర్ సాధించిన విద్యార్థులకు నెట్ స్కోర్ కి 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజీ ఇచ్చి పీహెచ్ డీ సీట్లు ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news