ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం

-

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో హోలీ పండుగపూట భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 13 మంది గాయపడినట్లు సమాచారం. హోలీ పండుగ సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భ గృహంలో భస్మ హారతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. అసలేం జరిగిందంటే?

ఆలయంలో స్వామి వారికి గులాల్‌ను సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో అక్కడే ఉన్న ఓ వస్త్రం వంటిది అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. ఈ ఘటనలో మొత్తం 13 మంది గాయపడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని ఇందౌర్‌ తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version