ఈ వారం టిల్లూతో పాటు ఇంకా ఏమేం సినిమాలు వస్తున్నాయంటే?

-

మార్చి నెల ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. ఇక వేసవి సందడి మొదలైంది. బాక్సాఫీస్ వద్ద అలరించడానికి వరుసగా సినిమాలు క్యూ కట్టాయి. గత రెండు మూడు వారాల నుంచి థియేటర్లో చిన్న సినిమాల హవాయే కొనసాగుతోంది. ఇక ఈ వారం కూడా టిల్లు స్క్వేర్ తప్ప పెద్దగా ఆకట్టుకునే సినిమాలేం లేవు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో మాత్రం అదరగొట్టే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్‌లో వినోదాన్ని పంచడానికి ఏయే సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేద్దామా?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’. ఈ మూవీ ‘ఆడు జీవితం’ పేరుతో తెలుగులో మార్చి 28వ తేదీన విడుదల కానుంది. బ్లెస్సీ దర్శకత్వం వహించారు. అమలాపాల్‌ కథానాయిక. మరోవైపు ‘డీజే టిల్లు’ చిత్రంతో కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్‌’ ఈనెల 29న థియేటర్లలో మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఇంకోవైపు విజువుల్‌ ట్రీట్‌నే అందించేందుకు ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం  ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ సిద్ధమైంది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ మార్చి 29న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version