మోదీ ఉక్రెయిన్‌ పర్యటనతో యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నాం : ఐరాస*

-

నేడు ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం దృష్ట్యా ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఆయన పర్యటనతో ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల పలు దేశాధినేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించారని.. ఈ పర్యటనలన్నీ సంఘర్షణకు ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మరోవైపు తాజాగా పోలాండ్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధించేందుకు భారత్ అన్ని విధాల సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు అందరీకి ఆందోళనకరమైన అంశాలేనని తెలిపారు. ఏ సమస్యకైనా పరిష్కారం యుద్ధభూమిలో లభించదని భారత్‌ దృఢంగా విశ్వసిస్తుందని పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news