‘సంకల్ప్ పాత్ర’ పేరుతో మహారాష్ట్ర మేనిఫెస్టో విడుదల

-

మహారాష్ట్ర మేనిఫెస్టో విడుదల అయింది. ‘సంకల్ప్ పాత్ర’ పేరుతో మహారాష్ట్ర మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేశారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఆదివారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Union Home Minister Amit Shah launches BJPs Sankalp Patra for MaharashtraAssemblyElections2024 in Mumbai

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ‘సంకల్ప్ పాత్ర’ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు అమిత్ షా. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని, మహా వికాస్ అఘాడి వాగ్దానాలు భావజాలాన్ని అవమానపరుస్తాయని అన్నారు. మహారాష్ట్ర లో బీజేపీ అఖండ విజయం గ్యారెంటీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version