పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. ఈ మేరకు లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ మేరకు 129 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఈ జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది.
కానీ ఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు ఇప్పటికే ఉంది. అటు ఇండియా కూటమికి 235మంది ఎంపీల మద్దతు ఉంది. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోన్నాయి ప్రతిపక్షాలు. మరి జమిలి ఎన్నికల బిల్లు పాస్ అవుతుందా.. లేక…. ప్యాకప్ అవుతుందో చూడాలి. అటు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ…బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. ఇక అటు లోక సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ గురించి స్పీకర్ మాట్లాడుతున్నారు.