టాలీవుడ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేశారు. అయితే.. ఇలాంటి తరుణంలోనే… మోహన్ బాబు భార్య మంచు నిర్మల స్టేట్ మెంట్ ఇచ్చారు. గొడవలు పెట్టిందే మనోజ్… అంటూ వ్యాఖ్యానించారు మోహన్ బాబు భార్య మంచు నిర్మల.
నా చిన్న కొడుకైన మనోజ్ కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉన్నదని తెలిపారు. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదని పేర్కొన్నారు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
నా పెద్ద కొడుకు విష్ణు జనరేటర్ లో చెక్కర పోయలేదు, ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదు అంటూ పోలీసు వారికి మోహన్ బాబు సతీమణి నిర్మల లేఖ pic.twitter.com/WTVBsRniVC
— At Theatres (@AtTheatres) December 17, 2024