‘ఆ విషయంలో భారత్‌ పనితీరు అద్భుతం’.. ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడి ప్రశంసలు

-

పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్‌ పనితీరు అద్భుతమని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) అధ్యక్షుడు డేనిస్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. డిజిటలైజేషన్‌ను భారత్ సమర్థంగా వినియోగించుకుంటోందని తెలిపారు. ఫోన్‌ లాంటి ఒక డివైజ్‌, డిజిటలైజేషన్‌ మోడల్‌తోనే ఇది సాధ్యమవుతోందని వెల్లడించారు. ఉత్పాదకతను పెంచడం, ఖర్చును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను సమర్థంగా మార్చడంలో డిజిటలీకరణ తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు.

జనవరి 22-26 మధ్య భారత్‌లో పర్యటించిన ఫ్రాన్సిస్‌.. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జైపుర్‌, ముంబయిలో పర్యటించి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధోసంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మహిళలు, రైతుల నుంచి ప్రతిఒక్కరూ తామున్న చోటు నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని ఫ్రాన్సిస్ అన్నారు. ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని కొనియాడారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్‌ గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు గమనించామని.. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఫ్రాన్సిస్‌ తెలిపారు. కార్మికులకు నిరంతరం పని లభిస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version