మహిళలను దారుణంగా కొట్టిన యూపీ పోలీసులు..వీడియో వైరల్‌

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కొంత మంది మహిళలను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌లో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర కొంత మంది మహిళలు ఆదివారం ధర్నా చేశారు.

అయితే.. వారు ఎందుకు ధర్నా చేశారో తెలియ రాలేదు… కానీ.. మొత్తానికి నిరసనకు దిగారు. ఇక ఈ విషయం తెలియడంతో…అక్కడికి చేరుకుని మహిళల నిరసనను పోలీసు సిబ్బంది భగ్నం చేశారు. దీంతో పోలీసు సిబ్బంది, మహిళా నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో.. మహిళలను దారుణంగా కొట్టారు పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.