వితంతువైన వదినతో పెళ్లి.. వరుడిని కాల్చిచంపిన సోదరులు

-

వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

బాగ్‌పత్‌ ఏఎస్పీ ఎన్‌.పి.సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వర్‌ అనే వ్యక్తికి సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్‌వీర్, యశ్‌వీర్‌ అనే నలుగురు కుమారులున్నారు. గతేడాది సుఖ్‌వీర్‌ మృతి చెందడంతో అతడి భార్య రితూను యశ్‌ వీర్‌ (32) అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఇది మిగతా సోదరులకు నచ్చలేదు. దీంతో ఈ విషయంలో ఆ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే యశ్​వీర్​పై పగ పెంచుకున్న వారు అతణ్ని మట్టుబెట్టాలని ప్లాన్ వేశారు. దిల్లీలో బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న యశ్‌వీర్‌ శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అప్పటికే మత్తులో ఉన్న అతడి సోదరులు తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్‌ రాకతో ఈ గొడవ మరింత తీవ్రమై అతణ్ని ఇతర సోదరులు తుపాకీతో కాల్చి చంపారు.

Read more RELATED
Recommended to you

Latest news