బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

-

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను తల్లి వెంటనే గుర్తించింది. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు.

అంబులెన్సులో విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్లగా.. వైద్యులు ఎక్స్‌రే తీసి చూడగా.. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీసి పాపను సురక్షితంగా కాపాడారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వేగంగా ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. బ్యాటరీపై ఉండే స్టీల్‌ కోటింగ్‌ తొలగిపోయి, కాస్త ఉబ్బిందని మరికొంత సమయం అలాగే ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువయ్యేదని అన్నారు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news