ప్ర‌ధాని మోడీపై ట్రంప్ ట్వీట్ ఇదే..!‌

-

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. దేశ ప్ర‌జ‌ల‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశాధినేత‌లు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. తాజాగా.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. గురువారం రోజున మోడీ 70వ పుట్టిన రోజు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. *గొప్ప నాయ‌కుడు, విశ్వాస మిత్రుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు* అంటూ డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఇండియా టూర్‌కు వ‌చ్చిన‌ప్పుడు అహ్మ‌దాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫోటోను కూడా త‌న విషెస్ ట్వీట్‌లో ట్రంప్ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

అలాగే.. మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ గురువారం అర్ధ‌రాత్రి ట్వీట్ చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక‌దూరం పాటించాల‌ని పిలుపునిచ్చారు. ఇదే త‌న పుట్టిన రోజున మీరిచ్చే కానుక అంటూ మోడీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version