ఉల్లి కొరతకు చెక్.. అన్ని సీజన్లలో సాగు చేసేలా 93కొత్త వంగడాల ఆవిష్కరణ

-

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. రోజువారి జీవితంలో ఉల్లిపాయ లేకుండా వంట వండటం కష్టం. కానీ ఉల్లిగడ్డ ధరలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు కొరత వల్ల డిమాండ్ పెరిగి.. దాంతో ధర పెరిగి.. సామాన్యులు ఉల్లి లేకుండా కూరలు వండుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. సంవత్సరంలో కనీసం రెండు మూడు నెలలు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఉల్లి కొరతకు ఎట్టకేలకు చెక్ పడింది.

అన్ని సీజన్లలో పండే, అత్యుత్తమ దిగుబడి అందించే 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని తాజాగా ఆవిష్కరించారు. వీటితో దేశంలో ప్రతి సంవత్సరం ఏర్పడే ఉల్లిపాయల కొరతను అధిగమించవచ్చని చెబుతున్నారు. వీటిలో ఎరుపుతో పాటు తెలుపు రంగు ఉల్లిపాయలకు చెందిన వివిధ రకాల జాతి విత్తనాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ విత్తనాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అందించనున్నట్లు చెప్పారు. తద్వారా రైతులు రెండు సీజన్ల(రబీ, ఖరీఫ్)లోనూ ఉల్లి సాగుచేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news