ఎట్టకేలకు కనిపించిన సొరంగంలో చిక్కుకున్న కూలీలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

-

ఉత్తరాఖండ్​ ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి దాదాపు 10 రోజులు కావొస్తోంది. 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయి బయటకు రాలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా వారిని బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఎట్టకేలకు వారు ఇవాళ కెమెరా కంటికి చిక్కారు. పక్కా ప్రణాళికలతో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు.. ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించి దాని ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఎండోస్కోపి కెమెరాను పంపి కార్మికులను ప్రత్యక్షంగా చూసి వారికి ధైర్యం చెప్పారు.

సొరంగం కూలిన ఘటన తర్వాత నాలుగు అంగుళాల గొట్టపు మార్గం ద్వారా కేవలం డ్రైఫ్రూట్సే మాత్రమే పంపుతున్నారు. అయితే తాజాగా ఏర్పాటు చేసిన గొట్టం ద్వారా తొలిసారిగా వారికి వేడివేడి ఆహారాన్ని పంపించారు. వేడివేడి కిచిడీని వాటర్ బాటిల్స్​లో నింపి కూలీలకు అందజేశారు. వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version