జీన్స్ వేసుకోమన్న అత్త.. చీరే కడతానన్న కోడలు.. ఠాణాకు చేరిన పంచాయితీ

-

సాధారణంగా అత్తా-కోడళ్ల మధ్య గొడవలు కామన్. అయితే నేటి ట్రెండీ కోడళ్లు.. పాతకాలపు అత్తలకు మధ్య ఎక్కువగా వాగ్వాదం జరిగే విషయం డ్రెస్సింగ్ స్టైల్ గురించి. ఆఫీసులకు వెళ్లే కొంత మంది మహిళలు నేటి ట్రెండ్​కు తగ్గట్టు జీన్స్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అత్తలేమో పెళ్లయిన మహిళలు అలాంటి దుస్తులు ధరించొద్దని వాళ్లను వారిస్తుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్​లోని ఆగ్రాలో ఓ అత్తాకోడళ్ల జంట మాత్రం దీనికి కాస్త భిన్నం.

అత్త జీన్స్ ధరించమని కోడలికి అల్టిమేటమ్ జారీ చేస్తే.. కోడలేమో తనకు చీరలు ధరించడమే ఇష్టమంటూ అత్తతో తేల్చి చెప్పేసింది. ఇలా ఈ విషయంలో ఇద్దరూ తరచూ గొడవ పడుతుండటంతో చివరకు కోడలు పోలీసులను ఆశ్రయించింది. తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయినని.. తనకు చీరకట్టులో ఉండటమే ఇష్టమని అమ్మాయి పోలీసులకు విన్నవించుకుంది. కానీ తన అత్త రోజూ ఆమెలాగే జీన్స్ వేసుకోమని ఒత్తిడి చేస్తూ ఇబ్బంది పెడుతోందని వారితో తన గోడు వెల్లబోసుకుంది. ఇదే విషయం తన భర్తకు చెబితే తననే కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏసీపీ సుకన్య శర్మ తెలిపారు. ఇప్పుడు న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version