ఓమిక్రాన్ తో వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం త‌గ్గ వ‌చ్చు – ఏఐఐఎంఎస్ డైరెక్ట‌ర్

-

క‌రోనా వైర‌స్ కొత్త ర‌కం వేరియంట్ ఓమిక్రాన్ చాలా ప్ర‌మ‌ద‌క‌ర‌మైంద‌ని ఏఐఐఎంఎస్ డైరెక్ట‌ర్ ర‌ణ్ దీప్ గులేరియా అన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ గురించి కీల‌క మైన విష‌యాల‌ను గులేరియా ప్ర‌క‌టించాడు. ఓమిక్రాన్ స్పైక్ ప్రోటీన్ లో దాదాపు 30 కి పైగా మ్మూటేష‌న్లు చెందాయని గులేరియా తెలిపాడు. దీంతో ఇది చాలా ప్ర‌మాద‌క‌రం గా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ కొత్త మ్యూటేష‌న్ల వ‌ల్ల శ‌రీరం లో ఇన్ ఫెక్ష‌న్లు వ‌స్తాయ‌ని వెల్లడించారు.

అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ నుంచి ఈ మ్యూటేష‌న్లు త‌ప్పించుకుంటాయ‌ని అన్నారు. ఈ మ్యూటేష‌న్ల సంఖ్య ఇంకా పెరిగితే వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం త‌గ్గ వ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్ల ను ఈ వేరియంట్ కోసం ప‌రిశీలించాల‌ని ర‌ణ్ దీప్ గులేరియా అన్నాడు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగం గా విస్త‌రిస్తుంది. అంతే కాకుండా ఇప్ప‌టికే ఓమిక్రాన్ బారిన చాలా మంది ప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news