నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రీసెంట్ గా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్రం లోక్ సభలో తొలిరోజే వ్యవసాయ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇక ఇప్పటికే బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలు అందరూ సభకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి.
కనీస మద్దతు ధరలు చట్టబద్దత, రైతుల డిమాండ్ l పై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరో 25 బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ లో వరి పంట కొనుగోలు పై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం పై కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలతో సమావేశం అయ్యి వారికి దిశా నిర్దేశం చేశారు.