విజయనగరం జిల్లా కేంద్రంలో మహా కవి గురజాడ అప్పారావు 158 వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్సవంగా గురజాడ జయంతి వేడుకల నిర్వహణ జరుగుతుంది. గురజాడకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాళి అర్పించారు. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తమ రచనల ద్వారా సాంఘిక పరివర్తన కోసం పరితపించిన అభ్యుదయ కవి శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ఆయన ట్వీట్ చేసారు.
శ్రీ గురజాడ వారి కలం నుంచి జాలు వారిన కన్యాశుల్కం, పూర్ణమ్మ, ముత్యాలసరాలు, దిద్దుబాటు వంటి రచనలు అభ్యుదయం దిశగా బాటలు వేశాయని వెంకయ్య కొనియాడారు. ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో శ్రీ గురజాడ వారు సాగిన అడుగుజాడలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తమ రచనల ద్వారా సాంఘిక పరివర్తన కోసం పరితపించిన అభ్యుదయ కవి శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/GZM12ovj88
— Vice President of India (@VPSecretariat) September 21, 2020