జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గా విజయ కిశోర్

-

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకురాలు విజయ కిశోర్‌ రత్నాకర్‌ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ కు చెందిన విజయ మహిళా హక్కుల ఉద్యమంలో చాలా కీలకంగా పని చేశారు. ఈమె బీజేపీలో ముఖ్య నాయకురాలు. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ మహిళా నాయకురాలికి కేంద్ర ప్రభుత్వం కీలక పదవి ఇవ్వడం విశేషం.

విజయ కిశోర్ మూడేళ్ల పాటు లేదా.. 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. వెస్ట్‌ బెంగాల్‌ లోని నార్త్‌ 24 పరగణాల జిల్లాకు చెందిన డాక్టర్‌ అర్చన మజుందార్‌ ను మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. విజయ జాతీయ మహిళా కమిషన్ కి 9వ చైర్ పర్సన్. ఈమె 2007-10 మధ్య ఛత్రపతి శంభాజీనగర్ మేయర్ సేవలందించారు. 2016-21 మధ్య మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్  పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news