Vijay : త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ TVK పార్టీ తీర్మానం

-

సినిమాల నుంచి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన దళపతి విజయ్ ప్రజాసంక్షేమం కోసం పోరాటం మొదలుపెట్టారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆయన తీవ్రంగా పోరాడుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) తీర్మానం చేసింది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజేసిన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాలను ఆమోదించింది.

శుక్రవారం రోజున తిరువన్మయూర్‌లో పార్టీ తొలి జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న ఈ సమావేశంలో వక్ఫ్‌ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వక్ఫ్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. తాము ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నామని,,  విద్యావిధానంలో మూడు భాషల విధానం అమలు ప్రతిపాదననుతాము అంగీకరించమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌ వల్ల కారణంగా దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని విజయ్ టీవీకే పార్టీ తమ తీర్మానంలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version