CWC-2023: ఇంగ్లాండ్ తో మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు రెడీ అవుతున్నారు. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ…. రోహిత్ శర్మకు బౌలింగ్ వేశారు. దాదాపు రెండు ఓవర్లు విరాట్ బౌలింగ్ లో రోహిత్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ప్లేయర్ లందరూ ఫుట్ బాల్ ఆడారు. మరి ENGపై విరాట్ కోహ్లీ బౌలింగ్ వేస్తారేమో చూడాలి. ఇటీవల BANపై కోహ్లీ 3 బాల్స్ వేశారు. ఇది ఇలా ఉండగా, ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కోచ్‌గా NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
వరల్డ్ కప్ అనంతరం ఆశీస్సులతో జరిగే టీ20 సిరీస్ కు NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ భారత జట్టుకో హెడ్ కోచ్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ వరల్డ్ కప్ తో పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం చీఫ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ మళ్ళీ దరఖాస్తుల్ని ఆహ్వానించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆసిస్ తో సిరీస్ కు లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించవచ్చని తెలుస్తోంది.