అంపైర్లు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో – గిల్ వివాదంపై సెహ్వాగ్‌ సీరియస్‌

-

 

WTC ఫైనల్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో గిల్ అవుట్ అయిన క్యాచ్ వివాదంగా మారింది. ఈ క్యాచ్ విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ సేహ్వాగ్ పూర్తిగా తప్పు పట్టారు. ‘గిల్ ఔట్ అయిన క్యాచ్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అంపైర్లు కళ్ళకు గంతలు కట్టుకున్నారేమో. ఇదే ఇలా సందేహాస్పదంగా ఉన్నప్పుడు అది నాటౌట్ అవుతుంది’ అని పోస్ట్ పెట్టారు.

కాగా, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రీన్ పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘చీటర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రీన్ బౌలింగ్ చేసేందుకు రాగా, గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ చీట్ చీట్ అంటూ అరిచారు. ఇక నెట్టింట చీటర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. గిల్ ఔట్ అయిన క్యాచ్ ను గ్రీన్ అందుకోగా, క్యాచ్ పట్టే టైములో బాల్ నేలను తాకింది. థర్డ్ అంపైర్ కూడా దానిని అవుట్ గా ప్రకటించారు. అయితే అది నాటౌట్ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news