అవినీతిని అంతం చేస్తామని.. ఇది మోడీ గ్యారెంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ప్రధాని మోడీ. ముఖ్యంగా అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల తెలంగాణలో టీఎస్ఫీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది. అన్ని నియామక పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయి.
బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రధాని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వ్యతిరేక ప్రభుత్వముందని తెలిపారు ప్రధాని మోడీ. బీఆర్ఎస్ బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్ ఇస్తామని చెప్పి మాట తప్పింది. తెలంగాణలో ఈసారి బీసీ సీఎం రాబోతున్నారు. కేంద్ర క్యాబినెట్ లో అత్యధిక మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారే మంత్రులుగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయి. ఎవ్వరూ ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిని తిరిగి రాబడుతామన్నారు. అవినీతి సర్కార్ ని ఇంటికి పంపడం ఖాయమన్నారు ప్రధాని మోడీ.