BREAKING NEWS: విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!

-

ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఎక్కువ శాతం మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా సరే ఎక్కువ కాలం కలిసి బ్రతకడంలో విఫలం అవుతున్నారు. ఇరువురి మధ్యన సరైన సాన్నిహిత్యం, అవగాహన, బంధం బలపడక మరియు వివాహేతర సంబంధాల వలన అతి తక్కువ వయసులోనే విడాకులు తీసుకుని దూరం అవుతున్నారు. ఇక తాజాగా ఒక స్టార్ సింగర్ విడాకులు తీసుకుని స్నేహితులు మరియు అభిమానులకు భారీ షాక్ ఇచ్చాడు. ప్రముఖ ర్యాప్ సింగర్ హనీ సింగ్ తన భార్య షాలిని తల్వార్ తో విడిడిపోవడానికి ఢిల్లీ కోర్ట్ అంగీకరిస్తూ విడాకులు జారీ చేసింది. దీనితో వీరి మధ్య ఉన్న 12 సంవత్సరాల వివాహ బంధానికి తెరపడింది.

ఈ విడాకులు ఫోర్స్ లోకి రావడంతో ఇకపై ఎవరి వ్యక్తిగత జీవితాలను వారు లీడ్ చేయనున్నారు. హానీ సింగ్ మరియు షాలిని తల్వార్ లు 2011 జనవరి 23 న పెళ్లి చేసుకున్నారు. ఇక హనీ సింగ్ దేశి కేల్కర్, సన్నీ సన్నీ , బ్లూ ఐస్ లాంటి పాటలతో బాగా పాపులర్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version