హృదయం సినిమా రిపీట్.. కుండపోత వర్షంలో వివాహ వేడుక

-

ఆ ఇద్దరి ప్రేమ పెళ్లి వరకు వస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఓపెన్ ఏరియాలో గ్రాండ్ గా అలంకరించి.. అట్టహాసంగా వేడుక జరపడానికి అన్నీ ముస్తాబు చేస్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి వర్షం మొదలవుతుంది. ఏం చేయాలో అర్థంగాక అందరూ వాన నుంచి తలదాచుకునేందుకు తలోవైపు వెళ్తారు. వధూవరులు కూడా వెళ్తారు. కానీ ఓ క్షణం తర్వాత ఇద్దరూ కలిసి వానలోకి పరిగెడతారు. అలా వర్షంలోనే కుటుంబ సభ్యుల మధ్య వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఇదంతా వింటుంటే సినిమా స్టోరీలాగా అనిపిస్తోంది కదూ. సినిమా స్టోరీయే. కానీ ఈసారి రియల్ లైఫ్ లో కూడా జరిగింది. ఎక్కడంటే..?
ఛత్తీస్​గఢ్​లోని కొన్ని జిల్లాలలో గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే ఓ ప్రాంతంలో పెళ్లి వేడుక నిర్వహించారు. ఇంతలో వర్షం కురిసింది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన మండపంలోకి నీళ్లు రావడం మొదలైంది. దీంతో పూజారితో పాటు పెళ్లికి వచ్చిన వాళ్లు వర్షంలో తడవకుండా ఇంట్లోకి పరుగుతీశారు. కానీ ముహూర్తం దగ్గర పడటం వల్ల వధూవరులకు ఆ ఛాన్స్​ రాలేదు.
పూజారి వర్షంలో తడవకుండా వరండాలో కూర్చొని మంత్రాలు చదువుతుండగా.. నూతన వధూవరులు ఏడడుగులు వేశారు. భార్య ముందు నడుస్తుండగా.. గొడుగు పట్టుకున ఆమె అడుగులో అడుగు వేశాడు భర్త. పెళ్లికి వచ్చిన అతిథులు ఈ తంతును వీక్షిస్తూ.. కేరింతలు, చప్పట్లు కొట్టారు. మరికొందరు ఆటపట్టించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version