WFI కొత్త చీఫ్ కు షాక్.. సంజయ్ సింగ్ ప్యానెల్ పై కేంద్రం సస్పెన్షన్ వేటు

-

డబ్ల్యూఎఫ్ఐ కొత్త పాలకవర్గానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం రోజున సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతనంగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ చీఫ్ సంజయ్ సింగ్.. అండర్ -15, అండర్ -20 రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ ఉత్తర్ ప్రదేశ్ గోండాలోని నంది నగర్లో జరుగుతాయని తొందర పాటుగా ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబ్ల్యూఎఫ్ఐ నింబధనలకు విరుద్ధంగా ఇలా ప్రకటన చేశారని కేంద్ర క్రీడా శాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే కొత్త పాలక వర్గాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

‘భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ప్రవర్తించినందున సస్పెండ్ చేశాం. కానీ, ప్యానెల్ను మేం రద్దు చేయలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా సస్పెన్షన్ కొనసాగుతుంది. వారు నియమ, నిబంధనలు అనురించాల్సి ఉంటుంది’ అని కేంద్ర క్రీడా శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news