జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

-

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. 2024 జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఓ లుక్కేద్దామా?

2024 జనవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా

  • జనవరి 1 (సోమవారం) : ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
  • జనవరి 11 (గురువారం) : మిషనరీ డే సందర్భంగా మిజోరం రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 12 (శుక్రవారం) : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బంగాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 13 ( రెండో శనివారం) :
  • జనవరి 14 (ఆదివారం) : లోరీ పండుగ సందర్భంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 15 (సోమవారం) : సంక్రాంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 16 (మంగళవారం) : పొంగల్ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 17 (బుధవారం) : తిరువళ్లువర్ డే సందర్భంగా తమిళనాడులో బ్యాంకుల సెలవు.
  • జనవరి 23 (మంగళవారం) : తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 25 (గురువారం) : హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 26 (శుక్రవారం) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జనవరి 27 ( నాల్గో శనివారం) :
  • జనవరి 31 (బుధవారం) : మీ-డ్యామ్-మీ-ఫై సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.

Read more RELATED
Recommended to you

Latest news